బన్నీ మళ్లీ ప్రకటించాడు

allu arjun announced new malayalam movie, for next year

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Allu Arjun Announced New Malayalam Movie, For Next Year

అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళంలో కూడా భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కేరళలో అల్లు అర్జున్‌కు భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. బన్నీ గత చిత్రాలు అక్కడ స్టార్‌ హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లు సాధించాయి. అక్కడ ఏ తెలుగు హీరోకు లేని గుర్తింపు బన్నీకి ఉంది. అందుకే చాలా రోజులుగా బన్నీ వారి రుణం తీర్చుకోవాలని భావిస్తున్నాడు.

మలయాళ ప్రేక్షకుల రుణం తీర్చుకునేందుకు ఒక డైరెక్ట్‌ మలయాళి సినిమా చేయాలనేది బన్నీ కోరిక. రెండు సంవత్సరాల క్రితమే ఒక మలయాళ సినిమాకు కథను సిద్దం చేయాల్సిందిగా అక్కడ రచయితలతో చెప్పాడు. ఇప్పటికే కొన్ని కథలు కూడా బన్నీ కోసం సిద్దం అయ్యాయి. కేరళ పరిసరాలకు తగ్గట్లుగా ఒక మంచి ప్రేమ కథను బన్నీ చేయాలని భావిస్తున్నాడు. దాన్ని తెలుగులో డబ్బింగ్‌ చేయాలనేది బన్నీ కోరిక.

వరుసగా తెలుగులో కమిట్‌ అయిన సినిమాల వల్ల మలయాళంలో సినిమా చేసేందుకు బన్నీకి టైం కుదరడం లేదు. దాంతో రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా మరోసారి మలయాళ సినిమా గురించి బన్నీ స్పందించాడు. నా కేరళ అభిమానులను సంతోష పెట్టేందుకు మలయాళంలో త్వరలోనే ఒక సినిమాను చేస్తాను అని, వారి రుణం తీర్చుకుంటాను అని చెప్పాడు. చూడబోతే వచ్చే సంవత్సరంలో బన్నీ మలయాళి సినిమా ఉంటుందేమో అనిపిస్తుంది.

మరిన్ని వార్తలు

డీజే దువ్వాడ జగన్నాధం తెలుగు బులెట్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ .

కమల్‌ అబద్దం చెప్తున్నాడు

ఎన్టీఆర్‌ కాబట్టి చేశా.. మళ్లీ చేయను

బన్నీ మళ్లీ ప్రకటించాడు - Telugu Bullet