డ్రీమర్లకు ట్రంప్ వెసులుబాటు

Dreamers revolution on Trump Decision

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Dreamers revolution on Trump

చిన్నప్పుడే అమ్మానాన్నలతో కలిసి అమెరికాకు బతకటానికి వచ్చిన వారిని డ్రీమర్స్ గా వ్యవహరిస్తారు. వీరికి గతంలో ఒబామా సర్కారు ఉద్యోగాలు చేసుకునే హక్కు ఇచ్చింది. కానీ ట్రంప్ మాత్రం ఆ హక్కు కుదురదన్నాడు. పైగా డ్రీమర్స్ అంతా దేశం విడిచిపెట్టి పోవాలని చెప్పాడు. దీంతో అమెరికాలో ఇరవై రాష్ట్రాలు కోర్టుల్లో కేసులు వేశాయి. ట్రంప్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవాడనికి వీల్లేదని పిటిషన్లు వేశాయి.

డ్రీమర్ల కేసులోనూ వీసాల తరహాలో ఎదురుదెబ్బ తప్పదని భావించిన ట్రంప్.. కాస్త వెనకడుగు వేశారు. డ్రీమర్లపై నిర్ణయం తీసుకోవడానికి ఆర్నెల్లు సమయం తీసుకోవాలని కాంగ్రెస్ ను కోరారు. దేశం నుంచి వెళ్లగొట్టడం కాకుండా.. ప్రత్యామ్నాయం చూడాలన్నారు. ఇటు డ్రీమర్లకు కూడా ఆర్నెల్లవరకూ పాత రూల్సే వర్తిస్తాయని చల్లటి కబురు చెప్పారు.

కానీ ట్రంప్ తగ్గినంత మాత్రాన.. కాంగ్రెస్ తగ్గాలనేం లేదు. అసలు డ్రీమర్స్ అంటేనే సెనేటర్లు మండిపడుతున్నారు. ట్రంప్ అతివాద భావజాలం ఉన్న సెనేటర్లు ఎక్కువమంది గెలవడంతో.. డ్రీమర్లకు ఇంకా ఆందోళనగానే ఉంది. ఇప్పుడు కాకపోయినా ఆర్నెల్ల తర్వాత అయినా పెట్టా, బేడే సర్దుకోక తప్పదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. కొంతమంది ఇప్పట్నుంచే ఇతర దేశాలకు వలసపోయే ప్రయత్నాలు మొదలుపెడుతుంటే.. మరికొందరు మాత్రం ఇంకా దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారు.

మరిన్ని వార్తలు:

బాలుడి హ‌త్య‌ కేసుః నిందితుడి అరెస్ట్

సెప్టెంబ‌రు 9 స‌చిన్ కు ఎంతో ప్ర‌త్యేకం