మైదానంలోనే మాజీ కెప్టెన్ నిద్ర‌

MS Dhoni sleeps on the ground during match

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అంపైర్లు, ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాళ్లు, జ‌ట్టు స‌హ‌చ‌రుడు మైదానంలో నిల‌బ‌డి ఉన్నారు. స్టాండ్స్ లో ప్రేక్ష‌కుల అరుపులు, కేక‌లు విన‌ప‌డుతున్నాయి. కామెంటేట‌రీ కొన‌సాగుతోంది. మైదానంలో ఏర్పాటు ఏసిన టీవీలు  ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నాయి. ఒక  ఆట‌గాడు మాత్రం వారంద‌రి మ‌ధ్య పిచ్ పై బోర్లా ప‌డుకుని త‌ల‌కింద చేతులు పెట్టుకుని నిద్ర‌పోతున్నాడు. హెల్మెట్‌, గ్లౌజులు కూడా తీసేసి క్రీజులో బోర్లా ప‌డుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయ‌నే మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.

వ‌రుస ప‌ర్య‌ట‌నలు, విరామం లేని షెడ్యూళ్ల‌తో అల‌సిపోయాడో ఏమో తెలియ‌దు కానీ… శ్రీలంక‌తో మ్యాచ్ లో  ధోనీ ఇలా సేద‌తీరుతూ క‌నిపించాడు. ఇప్పుడీ ఫొటో, దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.   ఐదు వ‌న్డేల సిరీస్ లో భాగంగా భార‌త్ శ్రీలంక మ‌ధ్య ఆదివారం క్యాండీ లో మూడో వ‌న్డే జ‌రుగుతోంది. 2-0తో ఆధిక్యంలో ఉన్న భార‌త్ మూడో మ్యాచ్ లోనూ  గెలుపుకు చేరువ‌యింది.  త‌మ జ‌ట్టు ఓట‌మి అంచున ఉండ‌టాన్ని జీర్ణించుకోలేని శ్రీలంక ప్రేక్ష‌కులు 44వ ఓవ‌ర్లో  స్టేడియంలోకి వాటిర్ బాటిల్స్ విసిరి నిర‌స‌న వ్య‌క్తంచేశారు. దీంతో అంపైర్లు మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. అప్ప‌టికే బాగా అల‌సిపోయిన ధోనీ విరామం దొర‌క‌టంతో హెల్మెట్, గ్లౌజులు తీసేసి ఇలా మైదానంలో బోర్లాప‌డుకుని కాసేపు క‌ళ్లు మూసుకున్నాడు.

ఇంకేముంది మైదానంలో నిద్ర‌పోయిన ధోనీ అంటూ సోష‌ల్ మీడియా ఆ ఫొటోను, వీడియోను తెగ షేర్ చేస్తోంది. మ్యాచ్ ను  నిలిపివేసిన త‌రువాత భ‌ద్ర‌తా సిబ్బంది మైదానంలోకి వాట‌ర్ బాటిల్స్ విసురుతున్న శ్రీలంక ప్రేక్ష‌కుల‌ను బ‌య‌టికి పంపించివేశారు. దీంతో మ్యాచ్ యధావిధిగా కొన‌సాగింది. 45.1 ఓవ‌ర్లో ల‌క్ష్యాన్ని చేధించిన భార‌త్ సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ధోనీ 67 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు

మరిన్ని వార్తలు:

2019 టీడీపీ స్టార్ క్యాంపైనర్స్ జగన్,రోజా .

కెసిఆర్ కోరిక తీర్చలేకపోయిన జగన్.

టీ 10 క్రికెట్లోకి సెహ్వాగ్