హైదరాబాద్ లో ఇదో మాఫియా ?

police Plans are on to end Hyderabad's beggar menace

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అప్పుడెప్పుడో దర్శకుడు పూరి జగన్నాథ్ పోకిరి సినిమాలో బిచ్చగాళ్ల ఎపిసోడ్ తో బాగా కామెడీ పండించాడు. నోరు పారేసుకున్న ముదురు బ్రహ్మచారి బ్రహ్మి కి బుద్ధి చెప్పేందుకు బిచ్చగాళ్ళు ఓ ముఠాగా ఏర్పడి బ్రహ్మి తాట తీయడం చూసి తెగ నవ్వుకున్నారు ప్రేక్షకులు. అయితే ఆ కామెడీ కేవలం కామెడీ కాదు. అందులో పచ్చి నిజాలు వున్నాయట. ఆ విషయం ఏంటో చూద్దాం.

హైదరాబాద్ ని విశ్వనగరం గా చేద్దామని లక్ష్యంగా పెట్టుకున్న తెరాస సర్కార్ ముందుగా సిటీ ప్రతిష్టని దెబ్బ తీస్తున్న బిచ్చగాళ్ల అంశం మీద దృష్టి పెట్టింది. బిచ్చగాళ్ళకి పునరావాసం కల్పించేందుకు ఓ సీరియస్ ప్రయత్నం చేసింది. అయితే నగరంలో బిచ్చమెత్తే దాదాపు 14 వేల మందిలో 98 శాతం నకిలీ అంట. వీళ్ళకి బిచ్చమెత్తుకునే పరిస్థితులు లేకపోయినా జస్ట్ తేలిగ్గా డబ్బు వస్తోంది కాబట్టి ఆ ప్రొఫెషన్ లో అలా సెట్ అయిపోయారంతే. ఈ నిజాన్ని నిగ్గు తేల్చడంతో పాటు నిజంగా దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్న వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది సర్కార్. మతిస్థిమితం తప్పినవారికోసం కూడా ప్రత్యేక సదుపాయాలు తలపెట్టింది. ఇంత పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పాటు యాచకులని ప్రోత్సహించవద్దని బహిరంగ ప్రకటనలు చేసింది. భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. ఇంత చేసాక కొన్నాళ్ల పాటు నగరంలోబిచ్చగాళ్ల హడావిడి తగ్గింది.

ఈ పరిణామం ప్రజలకు అర్ధం అయ్యే లోపే మళ్లీ బిచ్చగాళ్ల గొడవ నగరంలో పెరిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందా అని అధికారులు విచారణ చేపడితే కొన్ని షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. బిచ్చగాళ్ళని కూడా కొందరు ఓ మాఫియా ముఠాలా నడిపిస్తున్నారని సమాచారం అందిందట. ఈ బిచ్చగాళ్ళ ద్వారా ఆ మాఫియా నడిపిస్తున్న అసలు సూత్రధారులు కోసం పోలీస్ అధికారులు వల పన్నుతున్నారట. త్వరలో ఆ మాఫియా లీడర్స్ దొరుకుతారట. ఆ పని ఎంత త్వరగా అయితే అంత తొందరగా హైదరాబాద్ వాసులకి యాచకుల బాధ తప్పుతుంది.