తారా చౌదరి గురించి క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్‌

Rajasekhar Denies Relationship With Tara Chowdary

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ తాజాగా ‘గరుడవేగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత మంచి సక్సెస్‌ దక్కిన నేపథ్యంలో రాజశేఖర్‌ గత వారం రోజులుగా అన్ని మీడియాల్లో తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. పలు ఆసక్తికర విషయాలను చెబుతూ వస్తున్నాడు. ఆ మద్య తారా చౌదరితో రాజశేఖర్‌కు సంబంధం ఉందని, తారా చౌదరి కస్టమర్‌లలో రాజశేఖర్‌ ఒకరు అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై తాజాగా రాజశేఖర్‌ క్లారిటీ ఇచ్చాడు.Rajasekhar Denies Relationship With Tara Chowdary

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నేనేమి శ్రీరామ చంద్రుడిని కాదు, పెళ్లి కాక ముందు ఒక్కరు ఇద్దరితో వ్యవహారం నడిచింది. అయితే తారా చౌదరితో సంబంధం మాత్రం ఎప్పుడు లేదు. ఆమెను ఒకటి రెండు సందర్బాల్లో ఏదో విషయమై కలిశాను తప్ప అంతకు మించి మరేం లేదు. తారా చౌదరి తాను కలిసిన ఫొటోలను పట్టుకుని తనపై అసత్య ప్రచారం చేసిందని రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు. తాను తారా చౌదరి వ్యవహారంలో ఇరుకున్న సమయంలో చాలా మనోవేదనకు గురి అయ్యాను అంటూ రాజశేఖర్‌ పేర్కొన్నాడు. తనకు సంబంధం లేకున్నా కూడా తన పరువును తీస్తున్న వ్యక్తుల మీద తెగ కోపం వచ్చింది. కాని సరైన సమయం కోసం ఎదురు చూశాను. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఆమెతో ఎలాంటి సంబంధం లేదని, అసు ఆమె గురించి తనకు పెద్దగా తెలియదు అంటూ రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు.