తెలుగు న్యూస్ ఛానెల్స్ కి పండగొచ్చింది.

Telugu News Channels Are Celebrating Between Chandra babu and Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎక్కడో ఏదో జరిగితే ఇంకెక్కడో దాని ప్రభావం పడడం సహజం. ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానెల్స్ కు అలాంటి అదృష్టమే పట్టింది. కొన్నాళ్లుగా నష్టాలు మాత్రమే చూస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి చంద్రబాబు, జగన్ మధ్య పోటీ కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఎన్నికల ఏడాదిలో ఆదాయం పెరిగి పండగ రోజులు వస్తాయి అనుకుంటే ముందుగానే పండగ వచ్చింది.

ఏపీ లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి పాదయాత్ర మొదలు పెట్టారు వైసీపీ అధినేత జగన్. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రెంటిలో ఏది జనం దగ్గరికి ఎక్కువగా వెళ్ళాలి అన్న పోటీ మొదలైంది. దీంతో ముందుగా వైసీపీ వర్గాల నుంచి జగన్ పాదయాత్ర కవరేజ్ కోసం అని ఆఫర్స్ , ప్యాకేజెస్ వెళ్లాయి. దీంతో మెజారిటీ టీవీ ఛానెల్స్ జగన్ వెంట పడడంతో చంరబాబు అలెర్ట్ అయ్యారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ భేటీ చప్పగా లేకుండా చూడడానికి అధికార పక్ష ఎమ్మెల్యేలతో కొన్ని గట్టి ప్రశ్నలు అడిగిస్తున్నారు. పైగా ప్రభుత్వం తరపున అసెంబ్లీ సమావేశాల కవరేజ్ తగ్గకుండా టీవీ ఛానెల్స్ యాజమాన్యాలని అడుగుతున్నారు. దీన్ని అదనుగా తీసుకుని కొన్ని ఛానెల్స్ అంతకుముందు పెండింగ్ లో వున్న సొంత పనులు చేయించుకుంటున్నాయి. ఈ విధంగా బాబు, జగన్ ల మధ్య పోటీతో న్యూస్ ఛానెల్స్ పండగ చేసుకుంటున్నాయి.