అప్పుడు బైబిల్…ఇప్పుడు అమ్మవారి అక్షింతలు.

vijayamma new type of blessings for jagan and sharmila

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

2014 ఎన్నికల్లో అపజయం తర్వాత బయటికి రావడం పూర్తిగా తగ్గించారు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ. ఈసారి ప్లీనరీ లో ఆమె తనతో పాటు కుమార్తె షర్మిలని కూడా తీసుకొచ్చారు. విజయమ్మ ప్రసంగంలో కాంగ్రెస్ ని తిట్టడంతో పాటు కొడుకు పడుతున్న కష్టం గురించి చెప్పుకుని కంట తడి పెట్టారు. విజయమ్మ సభల్లో ఇది ప్రతిసారి కనిపించే సీన్. అయితే ఈసారి ఓ దృశ్యం లో మార్పు వచ్చింది. 2014 కి ముందు ఆమె ఎక్కడ ఏ సభలో కనిపించినా చేతిలో బైబిల్ ఉండేది. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమెతో పాటు వైసీపీ నాయకులు తిప్పికొట్టేవారు. అదంతా ఓ వర్గం ఓట్ల కోసమని విమర్శలు వచ్చినా బైబిల్ వెంట తెచ్చుకోవడం తన అలవాటు, విశ్వాసం అని విజయమ్మ చెప్పుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో ఈ వ్యవహారంతో కొంత లాభం జరిగినా ఎక్కువ నష్టమే జరిగిందని ఓ అంచనా.

2019 ఎన్నికలకు సన్నాహకంగా రెండేళ్ల ముందటే వైసీపీ ప్లీనరీ గ్రాండ్ గా నిర్వహించింది. అయితే ఈసారి విజయమ్మ చేతిలో బైబిల్ కనపడలేదు. ఆమె అలవాటు, విశ్వాసం మారాయో లేక రాజకీయ కారణమో చూసే ప్రజలకు బాగా అర్ధమైంది. అంతకన్నా పెద్ద విషయం ఏమిటంటే ఈసారి వైసీపీ ప్లీనరీ సాక్షిగా కొడుకు జగన్, కూతురు షర్మిల మీద అక్షింతలు చల్లారు. వైసీపీ నాయకురాలు రోజా విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పూజ చేయించుకుని తెచ్చిన అక్షింతలు విజయమ్మకు ఇవ్వగా వాటితో కొడుకు, కూతుర్ని ఆశీర్వదించారు విజయమ్మ. ఈ వ్యవహారం చూస్తుంటే దేవుడైనా, నమ్మకం అయినా అవసరానికి మించింది కాదని అర్ధం కావడం లేదా?

మరిన్ని వార్తాలు