ఐదవ చిరుతను బంధించిన అటవీ శాఖ అధికారులు.

leopard
leopard

తిరుమల భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమల అలిపిరి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది.ఇటీవల చిరుత నరసింహస్వామి ఆలయం ఏడవ మైలు వద్ద సంచారాన్ని ట్రాప్ కెమెరాల్లో గుర్తించి… అక్కడే బోను ఏర్పాటు చేసి బంధించారు. నిన్న అర్ధరాత్రి అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

మొత్తం ఐదు చిరుతలను గత రెండు నెలల కాలంలో అధికారులు బంధించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలకమండలి. ఇది ఇలా ఉండగా… గత నెలలో లక్షిత అనే చిన్నారిని చిరుత దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా నరసింహస్వామి ఆలయం సమీపంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో నిన్నటి నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు టీటీడీ పాలక మండలి కర్రల పంపిణీ చేస్తోంది.