పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి : నారా లోకేష్

Nara Lokesh Yuvagalam Padayatra will resume from today
Nara Lokesh Yuvagalam Padayatra will resume from today

పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి అంటూ నారా లోకేష్ సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్‌ అయ్యారు. చంద్రబాబును స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్ సీఐడీ పోలీసులు చేసారు..ఆయనను విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ విషయంపై నారా లోకేష్‌ స్పందించారు.

పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి…ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఆగ్రహానికి గురి అయ్యారు. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదని మండిపడ్డారు. మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా అవినీతి మచ్చ చంద్రుడిపై వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్ అంటూ ఆగ్రహించారు. నా తండ్రిని అక్ర‌మంగా అరెస్ట్ చేశారు. చూడ‌టానికి వెళుతున్న న‌న్ను న‌డిరోడ్డుపై నిర్బంధించారని నారా లోకేష్ నిప్పులు చెరిగారు .యువ‌గ‌ళం వ‌లంటీర్ల‌పై ఎటాక్ జ‌రిగింద‌ని ఫిర్యాదులు ఇస్తే, రివ‌ర్స్ కేసులు వారిపైనే బ‌నాయించిన పోలీసులు నాకు ర‌క్ష‌ణ క‌ల్పిస్తార‌ట‌! సిగ్గు! సిగ్గు! అంటూ రెచ్చిపోయారు.