పోస్ట్‌ చూసి ఊహాగానాలు చేయకండి!

Renu Desai
Renu Desai

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందనే దర్శకుడు రాఘవేంద్రరావు, ఆయన మనవడు కార్తికేయతో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! తాజాగా దీనిపై రేణు దేశాయ్  ఘాటుగా స్పందించారు. కార్తికేయ,అకీరాతో దిగీన ఫొటో పంచుకున్న అయన నాలుగో తరం అబ్బాయిలతో రాఘవేంద్రరావు అని పేర్కొన్నారు.

‘నా మనవడు కార్తికేయ, పవన్‌ కుమారుడు అకీరా నందన్‌.. ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్‌ స్కూల్లో చేరారు’’ అని ట్వీట్‌ చేశారు . అయితే ఆ ట్వీట్‌ను కాసేపట్లోనే తొలగించారు. అయిత అప్పటికీ ఆ ఫోటో స్ర్కీన్‌షాట్‌ల రూపంలో వైరల్ అయింది . దీంతో అభిమానులంతా అకీరాను బిగ్‌ స్ర్కీన్‌పై చూడనున్నామని సంబరపడుతూ…ఫొటోను షేర్‌ చేస్తున్నారు.

తాజాగా దీనిపై రేణు దేశాయి ఘాటుగా స్పందించారు. ‘‘హాయ్‌ గయ్స్‌.. ప్రస్తుతానికి అకీరాకు నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని అతను అనుకోవడం లేదు. నిజంగా అకీరా సినిమాల్లోకి రావాలనుకుంటే ఆ విషయాన్ని నేను మీతో పంచుకుంటానని మాటిస్తున్నా’’ అని అన్నారు. రాఘవేంద్రరావుతో దిగిన ఫోటోను  రేణు దేశాయ్ తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.