మ్యూజిక్ డైరెక్టర్ గా పవర్ స్టార్ తనయుడు…. మెగా ఫాన్స్ రియాక్షన్ ఏంటి?

మ్యూజిక్ డైరెక్టర్ గా పవర్ స్టార్ తనయుడు
మ్యూజిక్ డైరెక్టర్ గా పవర్ స్టార్ తనయుడు

మెగా ఫామిలీ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఈ సినీ కుటుంబంలో లేనంత మంది హీరోలు ఈ ఒక్క కుటుంబానికే సొంతం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడూ మంది హీరోలు ఈ ఫామిలీ లో ఉన్నారు. మొదట చిరంజీవి, అన్న ని అనుసరించి నాగ బాబు మరియు పవన్ కళ్యాణ్ సినీ రంగంలో అడుగుపెట్టారు. వీరిని అనుసరించి చిరు మరియు నాగ బాబు వారసులుగా రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక సినీ రంగ ప్రవేశం చేసారు.

అటు అల్లు ఫామిలీ నుంచి అల్లు అర్జున్, అల్లు శిరీష్, ఆ తదుపరి సాయి ధరమ్ తేజ్, కల్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్‌లు ఇండీస్ట్రీ కి పరిచయం అయ్యారు. అయితే మెగా ఫామిలీ లోని వారసులు సినీ ఇంస్ట్రీ లో అడుగు పెట్టగా, పవన్ కళ్యాణ్ తనయుడి పరిస్థితి ఏంటని తన అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయితే ఈ విషయం పై పవర్ స్టార్ మొదటి భార్య ఐన రేణు దేశాయ్ అందరికీ షాకిస్తూ ఒక క్లారిటీ ఇచ్చింది. పవన్ వారసుడు అకీరా నందన్ హీరో గా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా తన కెరీర్ ఎంచుకున్నాడని తెలిపింది. అయితే దీనికి కారణం లేకపోలేదు. రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు స్వయంగా తన కుమారుడు అకీరా నందన్ సంగీతాన్ని అందించాడు.

కార్తీక్ యార్లగడ్డ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఆంగ్ల బాషాలో తెరక్కేకిచ్చారు. అయితే అకీరా నందన్ ఇచ్చిన మ్యూజిక్‌ కు మంచి రెస్పాన్స్ వస్తోందని, కాగా, అకీరాకు చిన్ననాటి నుండే తనకు హీరోగా కావడం పెద్దగా ఆసక్తి లేకపోవడం, తనకు పూర్తిగా మ్యూజిక్ ప్రపంచంలో రాణించాలని కోరుకున్నాడు. అప్పట్లో పియానోపై మ్యూజిక్ ప్లే చేస్తున్న వీడియోలు వైరల్ కూడా అయ్యాయి అంటూ రేణు దేశాయ్ తెలిపారు.

పవర్ స్టార్ లానే తన కుమారుడిని ఆదరించి, ఆశీర్వదించాలని మెగా అభిమానులను రేణు దేశాయ్ కోరుకుంటున్నారు.

అయితే మెగా వారసుడిగా చూడాలనుకుంటే .. సైలెంట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడంటూ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.మరి దీనిపై మెగా, పవన్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.