అంతర్జాతీయ స్థయి బ్రాండ్ మన టార్గెట్ : నిర్మలా సీతారామన్

కరోనా దెబ్బకు ఆర్థిక రంగం పూర్తిగా కుదేలైంది. గత రెండు నెలలుగా ఏ పరిశ్రమ కూడా పనిచేసిన దాఖలాలు లేవు. దీంతో చిన్నతరహా పరిశ్రమలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లాయి. అయితే ఈ కరోనా ప్రభావంతో బలహీన పడిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిదే. ఈ ప్యాకేజీకి సంబంధించి వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దేశం ముందు ఒక సమగ్రమైన దార్శనికతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంచారని గుర్తు చేశారు. మంత్రివర్గం వివిధ స్థా ఈ ప్యాకేజీ లక్ష్యమని ఆమె వివరించారు.

అదేవిధంగా ఐదు మూల సూత్రాల ఆధారంగా ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్రకటనను మోడీ చేశారని తెలిపారు. ఆ ఐదు సూత్రాలు… ఆర్థికం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రజలు, గిరాకీగా ఆమె వెల్లడించారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ఈ ప్యాకేజీ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే.. ఆత్మ నిర్భర్ భారత్ అంటే… స్వయం ఆధారిత భారతం అని అర్థం. కాగా ఈ స్వీయ ఆధారిత భారత్ పేరుతో రూపకల్పన చేసిన ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను రోజుకు ఒకటి వెల్లడిస్తామని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయని వివరించారు. ఈరోజు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రకటిస్తున్నామని తెలిపారు.

కాగా ఈ కేటాయింపుల్లో భాగంగా ఎంఎస్ఎంఈలపై దృష్టి పెట్టింది కేంద్రప్రభుత్వం. ఎంఎస్‌ఎంఈలకు రూ.3లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎంఎస్ఎంఈల రుణాలకు కేంద్రం గ్యారంటీ ఇస్తుందని తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అదేవిధంగా..12 నెలల మారిటోరియంతో ఎంఎస్ఎంఈల రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు నిర్మలమ్మ. అంతేకాకుండా అక్టోబరు వరకు ఎంఎస్‌ఎంఈలకు రుణ సదుపాయం కల్పించనుంది కేంద్రం.50 వేల కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు నిధి ఏర్పాటు చేయనుంది కేంద్రం. కాగా ఎంఎస్‌ఎంఈలు తక్షణం ఉత్పత్తి ప్రారంభించేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడ్డ సూక్ష్మతరహ పరిశ్రమలకు, అలాగే ఎంఎస్ఎంఈ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి తోడ్పాటు అందించనుందని కేంద్రం స్పష్టం చేసింది. కాగా తీవ్రమైన రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్‌ఎంఈలకు 20వేల కోట్ల నగదును ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తి సామర్ధ్యం పెంపు కోసం 10వేల కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్‌ ప్రకటించడం విశేషం.