చైనా నుంచి ఇండియాకి రూటు మార్చిన జర్మన్ కంపెనీ…

కరోనా వైరస్ వూహాన్ లో పుట్టి ప్రపంచ దేశాలను వణికించేస్తుంది. దీంతో చైనాపై ప్రపంచ దేశాల్లో ఓ రకమైన ఏహ్యభావం కలుగుతుంది. వారు తినే తిండి.. ఆహారవిహారాలు, అక్కడి జనం, ప్రభుత్వం, ప్రజల తీరుతెన్నులు వంటివాటిపై ప్రపంచమంతా చర్చిస్తోంది. అందులో భాగంగా కరోనా వైరస్ తర్వాత చైనాపై అనేక దేశాలు గుర్రుమీద ఉన్నాయి. కరోనా వైరస్ ను అంచనా వేయడంలోనూ.. మహమ్మారిగా మారుతున్న దశలో కరోనాను కట్టడి చేసేందుకు తీసుకున్న విషయాలపై కరోనా వైరస్ గురించి ప్రపంచానికి చెప్పకుండా దాచడం వంటి వాటిల్లో చైనా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని అన్ని దేశాలకు స్పష్టమౌతుంది.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ను చైనానే సృష్టించి ప్రపంచం మీదకు వదిలింది అనే ప్రచారం విపరీతంగా జరుగుతుంది. దీంతో అనేక దేశాలకు చెందిన కంపెనీలు ఆ దేశాన్ని వదిలేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా జర్మన్ అంతర్జాతీయ బ్రాండెడ్ షూ కంపెనీ ఓన్ వెల్ ఎక్స్ ఓనర్ కాస ఎవర్జ్ తన ప్లాంట్ ను చైనా నుంచి తరలించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఇండియాతో చర్చలు జరిపి ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అయ్యారు. అప్పుడే ఆగ్రాలో ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ సంస్థ లైసెన్సీ లాట్రీక్ సంస్థతో కలిసి షూస్ ను తయారు చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది.

కాగా ప్రపంచంలో 80 దేశాల్లో ఈ కంపెనీ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. మొత్తం వారికి 18 ప్లాంట్లు ఉండగా.. చైనా నుంచి ఇండియాకు తన ప్లాంట్ ను తరలిస్తోంది. సంవత్సరానికి 30 లక్షల షూలను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకొని ఆగ్రాలో రూ.110 కోట్లతో ప్లాంట్ ను జర్మనీ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇలా చైనానుంచి అన్ని దేశాల కంపెనీలు ఇండియా తరలి వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.