దారుణం: ప్రేమ విఫలంతో ప్రియుడు ఆత్మహత్య….పెళ్లి కారణమా??

Couple Commit Suicide After Daughter Elopes With Lover

తెలంగాణలోని నాయయణ పేట జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లాడుతోందని.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న వైనం కలకలం రేపుతోంది. లింగంపల్లి పంచాయతీకి చెందిన కె.తిరుమలేశ్‌ అదే  గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ చాలా కాలంగా చెట్టపట్టాల్ వేసుకొని కలిసిమెలిసి తిరిగారు.  దీంతో తిరుమలేశ్ ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన గొర్రెలను మేపడానికి ఖమ్మం జిల్లాకు వలస వెళ్లాడు. ఈలోగా అతడి ప్రియురాలికి వారం రోజుల క్రితం వేరే అబ్బాయితో పెద్దలు పెళ్లి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

 అయితే ఈ విషయం తెలుసుకున్న తిరుమలేశ్ మానసికంగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకోలేకపోతున్నానే అని చాలా తీవ్రంగా ఆవేదనకు లోనయ్యాడు. తీవ్రమైన ఆందోళనతో శనివారం ఖమ్మం జిల్లాలోనే పురుగుల మందు తాగేశాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.