నవ వధువుకి కరోనా.. రిటర్న్ గిఫ్ట్ గా అతిధులంతా క్వారంటైన్ కి……….

Indian wedding ceremony. Weddings in India vary regionally, the religion and per personal preferences of the bride and groom. They are festive occasions in India, and in most cases celebrated with extensive decorations, colors, music, dance, costumes and rituals that depend on the religion of the bride and the groom, as well as their preferences

కరోనా రోజురోజుకీ సరికొత్త రీతిలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కరోనా వైరస్ రోజుకో కొత్త రకం వార్తలు వింతలు వినిపిస్తున్నాయి. అలాగే కొత్త తరా కేసులు వెలుగు చూస్తున్నాయి. పెళ్లి చేసుకుని కాపురానికి సిద్ధమైంది ఓ జంట. ఇదే సమయంలో.. కరోనా లక్షణాలతో బాధపడుతోన్న నవ వధువుకు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్‌గా తేలింది. వామ్మో ఇంకేముంది. పెళ్లైన రెండు రోజుల‌కే నవ వధువుకు క‌రోనా ఉన్నట్లు తేలింది. దీంతో.. వ‌ధూవ‌రుల‌ కుటుంబాల‌తోపాటు.. ఆ పెళ్లికి హాజరైన వారిలో ఆందోళన మొదలైంది.

విషయం ఏమిటంటే.. మ‌ధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని జ‌ట్ ఖేడి ప్రాంతానికి చెందిన యువ‌తికి రెండు రోజుల క్రితం వివాహమైంది. లాక్ డౌన్‌ నిబంధనలకు అనుగుణంగానే బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి తంతు జరిపారు. అయితే ఆ యువతి జ‌లుబు, జ్వరంతో బాధపడుతుండగా.. మందులు వాడతంతో కాస్త ఉల్లాసంఘానే కనిపించింది. ఇక పెళ్లి తర్వాత కరోనా టెస్ట్ నిర్వహిస్తే పాజిటివ్‌గా రావడంతో అంతా షాక్ తిన్నారు. ఇక.. అధికారులు వెంట‌నే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వ‌ధూవ‌రుల కుటుంబసభ్యులతో పాటు పెళ్లికి హాజ‌రైన‌ 32 మంది బంధువులను క్వారంటైన్‌లో తరలించడం కొత్త ట్విస్ట్.