మహేష్ బాబు-జక్కన్న మూవీలో బాలీవుడ్ బ్యూటీ ….

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీలో యాక్ట్ చేస్తుండగా.. ఈ సినిమా పూర్తవ్వగానే జక్కన్న కంపౌండ్‌లోకి ఎంటర్ అవ్వనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ఆ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిల్మ్ నగర్ నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ పాన్ ఇండియా మూవీలో మహేష్ బాబుకు జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ ను తీసుకునేందుకు జక్కన్న ఆలోచిన్నట్లు తెలుస్తోంది. కాని మూవీ మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు….