శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత.

Sriram Sagar project
Sriram Sagar project

తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి.ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం అధికారులు 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ఎగువ నుంచి ప్రాజెక్టులోకి దాదాపు 60 వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా, 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు . శ్రీరాం సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1000 91 అడుగులు కాగా ప్రస్తుతం అంతే గరిష్టానికి నీరు చేరడంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఇందులో భాగంగానే 16 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు.

కడెం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 696 అడుగులకు చేరింది. జలాశయంలోకి ఎగువ నుండి 21,100 క్యూసెక్కుల వస్తుండగా, 17,745 క్యూసెక్కుల నీటిని బయటకి వదులుతున్నారు.