సింగపూర్​ నూతన అధ్యక్షుడిగా ధర్మన్‌ షణ్ముగరత్నం.

Dharman Shanmugaratnam as the new president of Singapore.
Dharman Shanmugaratnam as the new president of Singapore.

భారత సంతతి వ్యక్తి, మాజీ మంత్రి ధర్మన్‌ షణ్ముగరత్నం సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించినట్లు. ఎన్నికల కమిటీ ధ్రువీకరించింది. సింగపూర్​లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో షణ్నుగరత్నానికి 70.4శాతం ఓట్లు పోలయ్యాయి. ఆయన ప్రత్యర్థులు టాన్‌ కిన్‌ లియాన్‌, ఎంగ్‌ కోక్‌సోంగ్‌లకు వరుసగా 13.88శాతం, 15.7 శాతం ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. 2011 తర్వాత దేశంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులను ఓడించి షణ్ముగరత్నం భారీ మెజారిటీతో గెలిచారు.

రిటర్నింగ్‌ అధికారి ప్రకటించిన ఈ ఫలితాలతో సింగపూర్‌కు భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక ఖరారైంది. ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ ఆయన్ను అభినందించారు.హలీమా యాకూబ్‌ ప్రస్తుత అధ్యక్షురాలు పదవీకాలం సెప్టెంబరు 13న ముగియనుంది.