అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10 మంది ఎంపీలుగా రాజీనామా

10 MPs who won the assembly elections resigned
10 MPs who won the assembly elections resigned

దేశంలో ఇటీవలే ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో బీజేపీ తరఫున గెలిచిన పది మంది ఎంపీలు తాజాగా తమ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు ఎంపీలు త్వరలోనే తమ పదవుల నుంచి వైదొలగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది ఎంపీల్లో పది మంది తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం తమ రాజీనామా లేఖలను లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు.

స్పీకర్​ను కలిసి రాజీనామా చేసిన రాజస్థాన్‌ ఎంపీలు :

* రాజ్యవర్థన్‌ సింగ్‌ రాఠోడ్‌
* దియా కుమారి
ఛత్తీస్‌గఢ్‌ ఎంపీలు :

* అరుణ్ సావో
* గోమతి సాయి
మధ్యప్రదేశ్​ ఎంపీలు :

* ద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌
* కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ
* రితి పాఠక్‌
* రాకేశ్‌ సింగ్‌
* ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌
వీరితో పాటు రాజ్యసభ ఎంపీ కిరోరిలాల్‌ మీనా కూడా తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా.. కేంద్రమంత్రి రేణుకా సింగ్‌, మహంత్‌ బాలక్‌నాథ్‌ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు.