‘పుష్ప’ నటుడు జగదీష్‌ అరెస్టు…!

'పుష్ప' నటుడు జగదీష్‌ అరెస్టు...!
Jagadessh

పుష్పఫేం జగదీశ్ గురించి తెలియని వారుండరు. అదేనండి ఆ సినిమాలో అల్లు అర్జున్‌ పక్కన కేశవ పాత్రలో కనిపించిన సహాయ నటుడిపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒక జూనియర్‌ అర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన కేసులో అతడిని అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఈ కేసులో జగదీశ్‌ని ఇవాళ కోర్టులో హాజరుపర్చినట్లు వెల్లడించారు.

జగదీశ్‌ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ (జూనియర్‌ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మహిల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకి గల కారణాలను తెలుసుకున్నారు.

'పుష్ప' నటుడు జగదీష్‌ అరెస్టు...!
Jagadessh

పోలీసులు తెలిపిన ప్రకారం.. “మహిళ గత నెల 27న ఒక వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్‌ ఫొటోలు తీసి ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశ్‌ని ఇవాళ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు . ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయం ఉన్నది ” అని పోలీసులు తెలిపారు.