Political Updates: ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం

TS Politics: Special funds for implementation of free electricity, gas cylinder
TS Politics: Special funds for implementation of free electricity, gas cylinder

నేడు తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. రేవంత్‌తో పాటు కొద్ది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఉంటుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

రేవంత్‌ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు తరలిరానున్నారు. సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌, ఖర్గే, కాంగ్రెస్‌ ఎంపీలు, ఇండియా కూటమి నేతలు, సీపీఐ నేత డి.రాజా, పలు రాష్ట్రాల సీఎంలు నీతీశ్‌ కుమార్‌, సిద్ధరామయ్య, మమతా బెనర్జీ, స్టాలిన్‌, హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌, పీసీసీ చీఫ్‌లు, జేఎంఎం నేత శిబూ సోరెన్‌, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, 250 మంది తెలంగాణ ఉద్యమకారులు, మరో 300 మంది అమరవీరుల కుటుంబాలు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పీసీసీ ఆహ్వానం పంపింది. మరికొన్ని గంటల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.