100 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి భారత్ అభివృద్ధి చెందుతుంది: మోదీ

India will develop by the time we celebrate 100th Independence Day: Modi
India will develop by the time we celebrate 100th Independence Day: Modi

భారత్ అభివృద్ధి చెందిన దేశంగా 2047 నాటికి అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో భారత్ జీ-20 సమావేశాలను నిర్వహించడం పట్ల పాక్, చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆ దేశాల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు .

వారి అభ్యంతరాలను కొట్టిపారేశారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణం అని పేర్కొన్నారు. భారత్ విజన్ ఏంటో ఈ జీ-20 సదస్సుతో ప్రపంచ దేశాలకు అర్థమవుతుందని వెల్లడించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదం కేవలం భారత్ కే పరిమితం కాకుండా ప్రపంచానికి దిక్సూచిగా మారిందన్నారు.

భారత్ 100 వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై భారత్ లో అవినీతికి, కుల రాజకీయాలకు తావు ఉండదని తేల్చి చెప్పారు. ఇలాంటి వాటికి దేశంలో చోటు ఉండదని అన్నారు. అలాగే త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ఎదుగుతుందన్న విశ్వాసం తమకు ఉందన్నారు.