పన్నెండేళ్లకే 100 ఇంటర్వ్యూలు

పన్నెండేళ్లకే 100 ఇంటర్వ్యూలు

12 ఏళ్ల ఓ బాలుడు 100 ఇంటర్వ్యూలు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలను ఇంటర్వ్యూ చేశాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఇంటర్వ్యూ చేసి స్టార్ అయ్యాడు. హర్యానాకు చెందిన గుర్మీత్ గోయత్‌ ఎలాంటి భయం లేకుండా క్లిష్టమైన ప్రశ్నలు అడిగిన ఇంటర్వ్యూలకు యూట్యూబ్‌లో చాలా వ్యూస్ వస్తున్నాయి. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న గుర్మీత్ గోయత్‌ రానున్న ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకి సంబందించిన  నేతలను ఇంటర్వ్యూలు చేసి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు.

ఈ బాల జర్నలిస్ట్ రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రం బయటా ముఖ్య నేతలతో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. గోయత్ ఇంటర్వ్యూలకు యూట్యూబ్‌లో లక్షలాది వ్యూస్ రావడం వల్ల హర్యానా వాసులు ముద్దుగా గుర్మీత్ గోయత్‌ ని గోల్డీ గోయత్‌గా పిలుచుకుంటున్నారు. దుష్యంత్ చౌతాలాను చేసిన ఇంటర్వ్యూ కి రెండు లక్షల వ్యూస్ రావడం వల్ల సోషల్ మీడియాలో హీరోగా గోయత్ మారాడు.

తన తాత గారు మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని రాజకీయాలు తనరక్తంలోనే ఉన్నాయని తొమ్మిదో తరగతి చదువుతున్నగుర్మీత్ గోయత్ వెల్లడించాడు.2034వరకు జర్నలిజం పూర్తిచేసే లక్ష్యంగా పెట్టుకుని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నాడు.