సౌదీ అరేబియాలో 35 మంది విదేశీయులు మృతి

సౌదీ అరేబియాలో 35 మంది విదేశీయులు మృతి

సౌదీఅరేబియాలోని మదీనా ఫ్రావిన్స్‌లోని అల్‌అఖర్‌ సెంటర్‌లో 40మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న భారీ ప్రొక్లెయినర్‌ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి 35 మంది విదేశీయులు అక్కడికక్కడే మృతి చెందారు.

దీంతో పెద్దఎత్తున బస్సులో మంటలు చెలరేగడంతో బయటికివచ్చేందుకు బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకి రావడానికి కిటికీ అద్దాలు పగల గొట్టినట్లు అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. బస్సు మొత్తం అప్పటికే మంటలు నలుగురు తీవ్రంగా గాయపడి 35 మంది అక్కడికక్కడే చనిపోయారు.

సౌదీ అరేబియా పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గరలో ఉన్న అల్‌-హమ్నా ఆసుపత్రికి తరలించారు.బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏషియన్‌,అరబిక్‌కు చెందిన పౌరులు ఉన్నారని సమాచారం.