‘మాస్ రాజా’ కు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం

'మాస్ రాజా' కు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం

రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రం ‘డిస్కో రాజా’.రవితేజకు జోడీగా ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నభా నటేష్ మరియు పాయల్ రాజ్ పూత్ లు రవితేజతో రొమాన్స్ చేస్తున్నారు.ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తోంది. ఆమద్య కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. దాంతో సినిమా విడుదల తేదీ చాలా దూరం వెళ్లింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఈఏడాది చివర్లో విడుదల చేస్తామంటూ ప్రకటించారు. కాని క్రిస్మస్ సందర్బంగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలాంటి పోటీ సమయంలో డిస్కో రాజాను కాస్త ఆలస్యంగా విడుదల చేయడం మంచిదని భావిస్తున్నారట.

పోటీ లేని సమయంలో ‘డిస్కో రాజా’ను విడుదల చేసే ఉద్దేశ్యంతో సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ను పరిశీలిస్తున్నారు. సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు ఉన్న కారణంగా ఆ తర్వాత రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్రంను విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా రిపబ్లిక్ డేకు పెద్ద సినిమాలు వస్తూనే ఉన్నాయి. సంక్రాంతి సీజన్ ముగిన వెంటనే రిపబ్లిక్ డే కు వచ్చే సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించిన దాఖలాలు ఉంటాయి. అందుకే రిపబ్లిక్ డేకు డిస్కోరాజాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

విఐ ఆనంద్ గత చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టాయి. అయితే రవితేజ పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉంది. మాస్ రాజా సక్సెస్ కొట్టి చాలా కాలం అయ్యింది. మద్యలో రాజా ది గ్రేట్ మినహాయిస్తే రవితేజ కెరీర్ చాలా డల్ గా సాగుతోందని చెప్పుకోవాలి.అలాంటి రవితేజకు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. అందుకే చాలా జాగ్రత్తగా హడావుడి లేకుండా సినిమాను పూర్తి చేస్తున్నారు. అలాగే అతి నమ్మకంతో పోటీ ఎక్కువ ఉన్న సమయంలో కూడా విడుదల చేయవద్దని భావిస్తున్నారు. ఈ కారణాల వల్లే డిస్కోరాజా చిత్రం వచ్చే ఏడాది జనవరి చివర్లో రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.