15మంది భార్యలు..రూ.175 కోట్ల గిఫ్ట్

అసలే.. కరోనా.. ప్రపంచదేశాలన్ని కరోనాతో అల్లల్లాడి పోతున్నాయి. లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అలాంటి సమయంలో ఓ దేశానికి చెందిన రాజు అవేం పట్టించుకోకుండా తనకున్న 15మంది రాణులతో రాయల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ భార్యల కోసమే ప్రభుత్వ ఖజానాని ఖాలీ చేసేస్తున్నాడు. అదేంటే చూద్దాం.

ముఖ్యంగా ఆఫ్రికా దేశంలో ఆకలి కేకలు విపరీతంగా ఉంటాయి. అసలే చీకటి ఖండం. ఆర్ధికంగా వెనకబడిన దేశాలు అధికంగా ఉన్న ఖండం.  వనరులు ఉన్నప్పటికీ వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోలేని దేశాలు ఆ ఖండంలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే అక్కడి ప్రజలు తీవ్రంగా ఆకలితో కొట్టుమిట్టాడుతుంటారు. ఆకలితో ప్రజలు అలమటిస్తుంటే.. న్యూజిలాండ్ దేశానికి చెందిన రాజు మాత్రం భార్యలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఏకంగా తన 15 మంది భార్యల కోసం రూ.175 కోట్ల రూపాయలతో 19 రోల్స్ రాయిస్ కార్లను కొన్నాడు.  స్వాజిలాండ్ దేశాన్ని పాలిస్తున్న రాజు మస్వతి III.

అయితే ఆఫ్రికా ఖండంలో ఇంకా పలు చోట్ల రాచరిక వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి స్వాజిలాండ్. ఆ దేశంలో రాజుదే సర్వాధికారం. అయన చెప్పిన విధంగానే అక్కడ ప్రభుత్వాలు నడుస్తాయి. అసలే పేదదేశం, నిరుద్యోగ సమస్యతో దేశం అల్లాడుతుంటుంది. అయినప్పటికీ రాజు అవేమి పట్టించుకోకుండా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో సగానికి పైగా తన కుటుంబ ఖర్చులకు, విలాసవంతమైన జీవితానికే ఖర్చు చేస్తున్నారని అక్కడి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం రాజు చేతుల్లో ఉండటంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. రాజుగారి ఇంటి గ్యారేజ్ మొత్తం కార్లతో నిండిపోయిందని, అయినాకానీ… నిరంతరం సరికొత్త కార్లు కొంటూనే ఉన్నారని, ఆ డబ్బును ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తే ప్రజలు సంతోషిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భార్యల కోసం స్వాజిలాండ్ రాజు కొనుగోలు చేసిన కార్లు వైరల్ కావడంతో, నెటిజన్లు ఆ దేశ రాజుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.