80ఏళ్ల వృద్ధురాలిపై 15ఏళ్ల బాలుడి అత్యాచారం

15 years old boy raped a old woman

దేశంలో మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడటం లేదు. 9నెలల చిన్నారి మొదలు 90 ఏళ్ల వృద్ధురాలి వరకు వయసు, వావివరుసలు మరిచి కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బిహార్‌లో 80 వృద్దురాలి మీద 15ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళితే బిహార్‌లోని మధుబని జిల్లాలోని జమైలా గ్రామంలో 80ఏళ్ల మహిళ బుధవారం ఇంట్లో నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన దూరపు బంధువైన బాలుడు ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో ప్రతిఘటించిన ఆమె అరించేందుకు ప్రయత్నించగా నోట్లో వస్త్రాలు కుక్కాడు. తనను రక్షించుకునేందుకు బాధితురాలు తీవ్రంగా పెనుగులాడినా ఫలితం లేకపోయింది. ఆ బాలుడు అత్యాచారం చేసి పారిపోతుండగా వృద్ధురాలు గట్టిగా కేకలు పెట్టింది. దీంతో మేల్కొన్న కుటుంసభ్యులు, స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలి కోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు మైనర్ కాదని, అతడిని బాలుడిగా చూపించి కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వృద్ధురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.