అమర్‌నాథ్ గుహ వద్ద ఊహించని ప్రమాదం 16 మంది మృతి, 30 మంది గల్లంతు…

అమర్‌నాథ్ గుహ
అమర్‌నాథ్ గుహ

జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం అమర్‌నాథ్‌లో (Amarnath Cave Floods) ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభవృష్టి అనంతరం ఒక్కసారిగా వరద పోటెత్తింది. మంచు లింగం ఉన్న గుహ వద్ద జలప్రళయం విరుచుకుపడింది. ఈ ప్రవాహంలో చిక్కుకొని కొంత మంది భక్తులు కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు. 30 మంది గల్లంతయ్యారు. ఒక్కసారిగా జలప్రళయం విరుచుకుపడటంతో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. సైన్యం వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లలో గాలిస్తోంది. అమర్‌నాథ్ గుహ సమీపంలో చిక్కుకున్న భక్తులను హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.కొవిడ్ సంక్షోభం కారణంగా రెండేళ్లు నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న తిరిగి ప్రారంభమైంది. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రకు ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజుల కింద యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వర్షం కొంత తెరిపి ఇవ్వడంతో యాత్రి తిరిగి ప్రారంభమైంది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం ఊహించనివిధంగా కుంభవృష్టి కురిసింది.