తాజాగా విశాఖలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తాజాగా విశాఖలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తాజాగా విశాఖలో మరొక మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం అని, కరోనా నియంత్రణకు అధికారుల కృషి అభినందనీయం అని వ్యాఖ్యానించారు. అయితే ఈ కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. కరోనా వైరస్ నియంత్రణ కు ప్రజలందరూ సామాజిక దూరం పాటించాల్సిందే అని అన్నారు.

అంతేకాకుండా ప్రజలకు ఎన్ని పనులు ఉన్నా ఇంట్లోనే ఉండాలని, ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అయితే ఈ కరోనా వైరస్ నియంత్రణకు దాదాపు 20 కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ప్రజలు భయాందోళనలకు గురి చేయడం సరికాదని ఆళ్ళ నాని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారు స్వచ్చందంగా రిపోర్ట్ చేయాలని, అంతేకాకుండా నిబంధనలు పాటించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.