ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆరేళ్ళ బాలుడి తల్లిదండ్రులు

ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆరేళ్ళ బాలుడి తల్లిదండ్రులు

చెన్నైలో ట్యాక్సీ న‌డుపుకొంటూ జీవనాన్ని సాగిస్తోన్న ఓ వ్య‌క్తి కుమారుడికి ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీని అత్య‌వ‌స‌రంగా నిర్వ‌హించాల్సి ఉంది. సరైన సమయంలో ఈ శస్త్ర చికిత్స‌ను చేయ‌క‌పోతే  బాలుడు జీవించ‌డం క‌ష్ట‌మ‌ని డాక్ట‌ర్లు తెలిపారు. దీని కోసం 10 ల‌క్ష‌ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతాయ‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు. ఆ బాలుడి పేరు దీప‌క్‌. వ‌య‌స్సు ఆరు సంవ‌త్స‌రాలు. స్థానిక పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్నాడు.

మూడేళ్ల కింద‌ట స్కూలుకు వెళ్లిన దీప‌క్‌ త‌ర‌గ‌తి గదిలోనే కుప్ప‌కూలిపోయాడు. ఈ విష‌యాన్ని ఫోన్ ద్వారా దీప‌క్ తండ్రికి తెలియ‌జేశారు టీచ‌ర్లు. ప‌రుగు ప‌రుగున స్కూలుకు వెళ్లి దీప‌క్‌ను ఎత్తుకుని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అత‌ణ్ని ప‌రీక్షించిన డాక్ట‌ర్లు దీప‌క్ గుండెలో కొన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయి, అత‌ని జీవితం ప్ర‌మాదంలో ప‌డింది.. అని డాక్ట‌ర్ తెలిపార‌ని, అది విన్న త‌న‌కు నోట మాట రాలేదని, తానేమీ చేయ‌లేని స్థితిలో ప‌డిపోయానని దీప‌క్ తండ్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న కుమారుడికి ఆ ప్రాణాంత‌క వ్యాధి ఎలా వ‌చ్చిందనే విష‌యాన్ని తాను న‌మ్మ‌లేక‌పోతున్నానని అన్నారు.కొన్నేళ్లుగా త‌న దిన‌చ‌ర్య ఇలాగే సాగుతోంద‌ని అన్నారు. ఏ ఒక్క‌రోజు కూడా ట్యాక్సీని న‌డ‌ప‌క‌పోతే తాను ఆదాయం రాదనే విష‌యం తెలుసని అన్నారు. తాను సంపాదించే ఆదాయంలో ప్ర‌తి పైసా కూడా నా ఆరేళ్ల కుమారుడి జీవితానికి ఎంతో అవ‌స‌రం అవుతుందని ఆ ట్యాక్సీ డ్రైవ‌ర్ వాపోయారు. ద‌య‌చేసి స‌హాయం చేయండి.. అని దీప‌క్ తండ్రి వేడుకుంటున్నారు.