వరంగల్ జిల్లాకు చెందిన నితిన్‌కుమార్ అగర్వాల్(38), బషీర్‌బాగ్‌లో నివాసం ఉంటూ అదే ప్రాంతంలో యాస్ వెకేషన్స్ పేరిట ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా వివిధ దేశాలలో సందర్శక ప్రాంతాలను సందర్శించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నితిన్‌కుమార్‌ను ఆశ్రయించారు. దాదాపు 100 మంది వద్ద లక్ష నుంచి రెండు లక్షల చొప్పున వసూలు చేసిన నితిన్‌కుమార్ వారికి విసా, ప్లాయిట్ టికెట్లు ఇప్పించడంలో ఆలస్యం చేయడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
దీంతో సుల్తాన్‌బజార్‌కు చెందిన ఖలీల్, పాండురంగ మరో 20 మంది వద్ద ఈ జూన్ 22న యూరప్, థాయ్‌లాండ్, ఉజ్జయినీ లాంటీ ప్రాదేశాలకు తీసుకువెళ్లేందుకు వీసా, టికెట్లు ఇప్పిస్తానంటూ నమ్మబలికి వారి వద్ద రూ. 9.70 లక్షలు వసూలు చేశాడు. వినియోగదారులు తమ డబ్బు తమకు అప్పగించాలని ఒత్తిడి తీసుకురావడం, అప్పులు అధికం కావడంతో నితిన్‌కుమార్ తాను ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్‌నోటు రాసి ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు సైఫాబాద్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ నమోదు చేయించారు. అదే పోలీసుస్టేషన్లో నితిన్‌కుమార్ భా«ధితులు తమను చీటింగ్ చేశాడని సైతం కేసు నమోదు అయ్యింది. విషయం తెలుసుకున్న సుల్తాన్‌బజార్, నల్లకుంట ప్రాంతాలకు చెందిన భాధితులు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఈ నెల 11వ తేదీన ఫిర్యాదు చేశారు.