ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో దీపావళి పండగ వేడుకల్లో కొంత మంది చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పండగ సంతోషం లో ఆనందంగా టపాసులు కాల్చుతున్న వ్యక్తి పై 15 మంది వ్యక్తులు దాడి చేయగా అక్కడిక్కడే మరణించాడు.
భువనేశ్వర్ సమీపంలో సుందర్ పాడ ప్రాంతంలో అమరేశ్ నాయక్ టపాసులు స్నేహితులతో కలిసి పేల్చుతున్నాడు. అమరేశ్ వద్దకు వచ్చి దారిలో వెళ్తున్న కొంత మంది కాల్చనివ్వకుండా అడ్డుకోవడం తో ఇద్దరి మద్య గొడవ చోటు చేసుకుంది. 15మంది వ్యక్తులు కోపంతో ఒకే సారి అమరేశ్ నాయక్‌పై ఆయుధాలతో దాడి చేయగా అక్కడిక్కడే పడిపోయాడు. పదునైన ఆయుధాలతో దాడికి దిగగా చాలా గాయపడిన అమరేశ్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకుని వెళ్లగ అప్పటికే అమరేశ్ నాయక్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.