ప్రియుడ్ని మర్చిపోలేకపోయిన యువతి.! రెండు నెలలలో వరుస విషాదాలు

Young woman commits suicide
Young woman commits suicide

యానాంలో యువతి ఆత్మహత్య కలకలంరేపింది. ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి కూడా ప్రాణాలు తీసుకుంది. యానాంలోని యూకేవీ నగర్‌కి చెందిన మౌనికకు అక్క, చెల్లి ఉన్నారు.. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్‌ కాలేజీలో మౌనిక నర్సింగ్‌ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఈమె అక్క, చెల్లెలకు వివాహాలు కాగా.. అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక బాధ్యతల్ని ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు చూసుకుంటున్నారు.

మౌనిక రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన చిన్నా అనే యువకుడిని ప్రేమిస్తోంది. అతడు రెండు నెలల క్రితం గంజాయికి బానిసై రూ.500 అడిగితే.. తన సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. అతడు కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అప్పట్నుంచి మౌనిక కాలేజీకి వెళ్లడం మానేసింది.గదిలో చిన్నాకు సంబంధించిన దుస్తులు, వస్తువులను పెట్టుకుని ఫొటోలు గోడలకు అతికించి చూసుకుంటూ.. మానసికంగా బాగా కుంగిపోయి కనిపించింది.

ఇంతలో మౌనిక సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మౌనిక ప్రియుడు చనిపోయిన రోజు నుంచి ఎంతో బాధతో ఉందని చెబుతున్నారు. యువతి మరణంతో ఇద్దరు సోదరిలు తీవ్ర విషాదంలో ఉన్నారు.