‘రొమాంటిక్’ ఆకాష్‌ పూరి

‘రొమాంటిక్’ ఆకాష్‌ పూరి

సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ ఉన్న ఢిల్లీకి చెందిన మోడల్ కేతికాశర్మ హీరోయిన్‌గా  డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ కుమారుడు పూరీ ఆకాష్‌ హీరోగా నటిస్తున్న‘రొమాంటిక్‌’మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఎప్పుడూ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, 1.6మిలియన్ ఫాలోవర్లు ఉన్న కేతికాశర్మ తొలిచిత్రంతోనే ఫస్ట్‌లుక్‌లో స్టన్నింగ్‌ ఫోటోతో ఆదరగొట్టింది.

టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరో నటిస్తున్న రెండో చిత్రం‘రొమాంటిక్’. ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ‘రొమాంటిక్’ సినిమా పూరికనెక్ట్స్,పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై రానున్నది.ప్రేమకథాచిత్రంగా తెరకెక్కుతోన్న‘రొమాంటిక్’ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇంకా కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ సమకూరుస్తున్నారు.