మాస్ మాడ్రన్ దేవదాసుగా అలరించనున్నకుర్ర హీరో

మాస్ మాడ్రన్ దేవదాసుగా అలరించనున్నకుర్ర హీరో

‘డాక్టర్‌ 90ml మాత్రమే తాగమన్నారు’అంటూ చెప్పిన డైలాగులు క్రేజీ హీరోగా గుర్తింపు పొందిన కార్తికేయని యాక్షన్ సీన్లలో నిలబెట్టనున్నాయి.ప్రస్తుతం‘90ml’సినిమాలో నటిస్తున్న ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఈనెల సెప్టెంబర్‌21న 90ml చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది.“అరెయ్‌..డీజిల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్‌,పెట్రోల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్‌,ఇది లిక్కర్‌తో నడిచేబండి..గుద్దితే అడ్రస్‌ ఉండదు”అని టీజర్‌లో కార్తికేయ చెప్పిన డైలాగ్‌ మాస్‌ను ప్రేక్షకులని చాలా ఆకట్టుకుంటుంది.ఇంకో సీన్‌లో అలీ కార్తికేయతో ‘డైలీ ఎంత వేస్తావ్‌’ అని అడిగితే ‘పూటకు 90mlసార్‌’ అని కార్తికేయ చెబుతాడు. తర్వాత అలీ ‘ఏ క్వార్టర్‌ ఇస్తే తాగవా?’అని ఆడగ్గానే ‘డాక్టర్‌ 90ml మాత్రమే తాగమన్నారు’అంటూ చెప్పిన డైలాగులు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.