సింహం మీద జింక గెలుపు… సీక్రెట్ ఇదే.

Achieve A Goal In Our Life By Knowing Strengths And Weakness

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మృగరాజు సింహం ఓ వైపు … ప్రాణభీతితో తల్లడిల్లే జింక ఇంకో వైపు. ఎవరిది గెలుపు అంటే తేలిగ్గా వచ్చే సమాధానం సింహం అని. కానీ ఆ చిన్న విషయంలోనే ఓ లోతైన అంశం దాగి వుంది. సింహం సాధించే విజయాల శాతం కన్నా జింక సాధించే విజయాల శాతం ఎక్కువ. ఆశ్చర్యపోతున్నారా ? . కానీ ఇది నిజం. ఓ సింహం ఆకలి అయినప్పుడు వేటకి బయలుదేరుతుంది. ఆ వేటలో కంటికి కనిపించిన జింక మీదకి దూసుకెళుతుంది. ఈ పరుగు పందెంలో ఎక్కువసార్లు గెలిచి జింక తన ప్రాణాలు నిలుపుకుంటుంది. అతి తక్కువ సార్లు మాత్రమే సింహం బారిన పడి ప్రాణాలు కోల్పోతుంది. అంత బలం వున్న సింహం కన్నా జింక శారీరకంగా బలహీనం కానీ ఇలా ఎలా జరుగుతుందో తెలుసా ?

సింహం తన ఆహారం కోసం పరుగులు తీస్తుంది. లేడి తన ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు తీస్తుంది. అవసరం కోసం చేసే పని కన్నా ప్రాణాలు పెట్టి చేసే పనికి చిత్తశుద్ధి ఎక్కువ. ఇది వినడానికి సింహం, జింక కథ లా అనిపించినా చేసే పని వెనుక వున్న లక్ష్యం జయాపజయాల్ని పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తుంది. చేసే పని ప్రాణాలు పెట్టి చేస్తే అలివికానిది, అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అవుతుంది. ఈ సీక్రెట్ తెలుసుకుని పని చేస్తే ఓ జీవిత సత్యం అర్ధం అవుతుంది. వున్నది ఒకటే దారి అయినప్పుడు మాత్రమే మిగతా ఆలోచనలు పక్కనబెట్టి అందులో వేగంగా ముందుకెళ్లి గమ్యాన్ని చేరుకోవడం మీద దృష్టి పెడతాం.