హీరోయిన్ పూనంకౌర్ తెలుగులో కొన్ని సినిమాలకి హీరోయిన్ గా చేసినా, మరికొందరు స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలు పాత్రలు పోషించినా పెద్దగా రాని గుర్తింపు తెలుగు సినిమా మొత్తానికి తానే క్రిటిక్ గా భావించే కత్తి మహేష్ గతంలో పూనంకౌర్ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెట్టారు. గతంలో పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ మీడియాకి ఎక్కినప్పుడు పూనంకౌర్ కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేశారు. అవి కత్తి మహేష్‌ను ఉద్దేశించినవి లాగే ఉండటంతో ఆయన పూనంకౌర్ మీద కూడా ఆరోపణలు చేశారు. పూనం పవన్‌లకు కలిపి అనేక ఆరోపణలు చేశారు. దీంతో పూనం అప్‌సెట్ అయ్యారు. ఈ వివాదం నుంచి తనను కాపాడాలని తొలుత సోషల్ మీడియాలో పవన్‌కు మొరపెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత ట్వీట్‌ను తొలగించారు. దీంతో ఈ వివాదం అప్పట్లో కాస్త్త ప్రస్నార్ధంగా మిగిలింది. సరిగ్గా అప్పటి నుండే పూనం యే ట్వీట్ చేసినా ఇన్స్టా లో పోస్ట్ చేసినా అది పవన్ ని ఉద్దేసిన్చినట్టే పోలికలు ఉంటుండడం ఆమె యే ట్వీట్ చేసినా ఇంటర్వ్యూ ఇచ్చినా అది హాట్ టాపిక్ అవుతోంది.
తాజాగా ఆమె తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిశారు. ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు, ఆయనతో ఆమె కాసేపు చర్చలు జరిపారు. అయితే ఈ సమావేశం రహస్యంగా జరిగింది మీడియాకు తెలియనివ్వలేదు. కానీ డీజీపీతో పూనంకౌర్ సమావేశానికి సంబంధించి తెలుగు మీడియా పసిగట్టింది . దాదాపుగా అరగంట సేపు పూనంకౌర్, డీజీపీ మహేందర్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇటీవల ఓ న్యూస్‌చానల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో కూడా తనకు అన్యాయం చేసిన వారిని ఎప్పటికైనా వదిలి పెట్టబోనని చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు పూనంకౌర్ ఎందుకు డీజీపీని కలిసారు అనే అంశం మీద చర్చ మొదలయ్యింది. ఆమె చేస్తున్న ప్రతి ట్వీట్ పవన్ ను ఉద్దేశించే అని భావన కలిగేలా ట్వీట్ చేస్తుండడంతో ఒకవేళ ఆమె చేస్తానన్న పోరాటం ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారా…? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన పోరాటానికి రక్షణ కావాలని ఆమె అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. తను బయటపెట్టే విషయాలతో ఫ్యాన్స్ పేరుతో తనపై ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి రక్షణ కోసం పోలీసుల వద్దకు వెళ్లారా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆమె డీజీపీని ఎందుకు కలిసిందో తెలీదు కాని పవన్ గురించి అయితే మాత్రం ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న పవన్ ఎదుగుదలకి మాత్రం ఇది గొడ్డలి పెట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదు.