ఇక నుంచి అక్కినేని సమంత‌

Actress samantha changed her name to Samantha Akkineni

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అమ్మాయిల‌కు పెళ్లి అనంత‌రం ఇంటిపేరు మార‌డం మ‌న దేశంలో స‌హజం. పుట్టినింటి పేరును తొల‌గించుకుని అత్త‌గారి ఇంటిపేరును జ‌త చేసుకుంటారు. సెల‌బ్రిటీలు ఇందుకు మిన‌హాయింపు కాదు. బాలీవుడ్, టాలీవుడ్…ఇలా ఏ భాష‌కు చెందిన హీరోయిన్లయినా పెళ్లి త‌ర్వాత అత్త‌వారింటి పేరుతోనే గుర్తింపు పొందుతున్నారు. మీడియా సైతం వారి గురించి రాసేట‌ప్పుడు కొత్త పేరునే ప్ర‌స్తావిస్తుంటుంది. తాజాగా హీరోయిన్ స‌మంత కూడా త‌న ఇంటిపేరు మార్చుకున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య‌ను ఈ నెల ఆరోతేదీన వివాహం చేసుకున్న స‌మంత…

 

ట్విట్ట‌ర్ లో త‌న పేరును అక్కినేని స‌మంత‌గా మార్పు చేశారు. ఇప్ప‌టిదాకా ట్విట్ట‌ర్ లో ఆమె ఎకౌంట్ స‌మంత రుత్ ప్ర‌భు అని ఉండేది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం పాత పేరే కొన‌సాగుతోంది. వైభ‌వంగా జ‌రిగిన వివాహ వేడుక త‌ర్వాత స‌మంత మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అవుతున్నారు. త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య‌, స‌మంత వివాహ రిసెప్ష‌న్ హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది.