‘ఎన్టీఆర్‌’పై నాగబాబు మళ్లీ నోరు పారేసుకున్నాడు…!

Naga Babu Ultimate Reply To Balakrishna On 6th Comment

గత కొన్ని రోజులుగా బాలకృష్ణపై నాగబాబు రకరకాలుగా విమర్శలు చేస్తూ, ఎద్దేవ చేస్తూ ఉన్నాడు. ఆమద్య ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తెలియదు అన్నాడు. ఆ తర్వాత కామెడీ బాగా చేస్తాడు, బాలకృష్ణ అంటూ కామెంట్‌ చేశాడు. బాలకృష్ణ గురించి నాగబాబు చేస్తున్న కామెంట్స్‌ పై సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. సోషల్‌ మీడియాలో నాగబాబుపై నందమూరి ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున విరుచుకు పడుతున్నారు. బాలకృష్ణపై నాగబాబు వరుసగా ఏదో రకంగా కామెంట్‌ చేస్తూనే ఉన్నాడు. తాజాగా బాలయ్య నటించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌పై విభిన్నంగా, వివాదాస్పదంగా, ఇండైరెక్ట్‌గా నాగబాబు స్పందించాడు.

ఒక కవిత రూపంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌పై తనదైన శైలిలో స్పందించాడు. నాగబాబు ఆ కవితలో ‘ఎన్టీఆర్‌’ మూవీ నిజమైన బయోపిక్‌ కాదని, కల్పితాలు, కథలు చేర్చి ఆ బయోపిక్‌ను తీస్తున్నారు అంటూ ఎద్దేవ చేస్తున్నాడు. నాగబాబు సోషల్‌ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున నందమూరి ఫ్యాన్స్‌ విరుచుకు పడుతున్నారు. నందమూరి ఫ్యాన్స్‌ డైరెక్ట్‌గా కూడా నాగబాబును టార్గెట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కామెంట్స్‌ రూపంలో నాగబాబును ఏకి పారేస్తున్నారు. మరీ ఇంతగా బాలయ్యను నాగబాబు టార్గెట్‌ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ఆమద్య చిరంజీవి మరియు బాలకృష్ణలు కలవడం, ఇద్దరు అన్యోన్యంగా మాట్లాడుకోవడం కనిపించింది. కాని ఇప్పుడు చిరంజీవిపై బాలయ్య ఏ కారణంగానో కోపంగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు బాలయ్యను నాగబాబు టార్గెట్‌ చేశాడు అంటూ కొందరు భావిస్తున్నారు. మరో వైపు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ గురించి కూడా నాగబాబు ఇలా బాలయ్యపై కామెంట్స్‌ చేస్తూ ఉండవచ్చు అంటూ మరి కొందరు విశ్లేషిస్తున్నారు.