దర్శకుడు అజయ్‌ భూపతికి కరోనా

దర్శకుడు అజయ్‌ భూపతికి కరోనా

టాలీవుడ్‌లోనూ కరోనా మహమ్మారి మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందటం ప్రారంభం అయింది. ఇటీవలే దర్శకులు తేజ, రాజమౌళిలకు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఆల్రెడీ నెగటివ్‌ అయ్యారు. తాజాగా దర్శకుడు అజయ్‌ భూపతికి కరోనా వచ్చింది. ‘వచ్చేసింది (కరోనాను ఉద్దేశించి). త్వరలో వస్తా, ప్లాస్మా ఇస్తా’’ అని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు అజయ్‌. ‘ఆర్‌ ఎక్స్‌ 100’తో దర్శకుడు అజయ్‌ భూపతి సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ మల్టీ స్టారర్‌ చిత్రం ప్లాన్‌ చేస్తున్నారు.