హౌరాబ్రిడ్జ్‌లో అలరించనున్న అజయ్‌

ajay-says-about-his-role-on

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా తెరకెక్కుతున్న ‘హౌరాబ్రిడ్జి’ చిత్రం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్‌లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు యాదు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో రాహుల్‌ రవీంద్రన్‌ చాలా మంచి పాత్ర పోషించాడని, ఈ చిత్రం తర్వాత ఖచ్చితంగా రాహుల్‌కు మంచి అవకాశాలు వస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించిన అజయ్‌ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ajay

అజయ్‌ పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని, గతంలో ఎప్పుడు చేయనటువంటి పాత్రను అజయ్‌ చేశాడని, తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత అజయ్‌కి మళ్లీ మంచి ఆఫర్లు రావడం ఖాయం, అన్ని రకాల షేడ్స్‌ను ఇందులో చూపించి అజయ్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాడు. టీజర్‌లో అజయ్‌ లుక్‌ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. అజయ్‌ మాట్లాడుతూ ఒక మంచి సినిమా చేశాను, యాదు మంచి స్క్రీన్‌ప్లేతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమాను తెరకెక్కించాడు. తప్పకుండా ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అజయ్‌ చెప్పుకొచ్చాడు.

howrah-bridge-movie