అఖిల్‌ 3వ సినిమాపై కొనసాగుతున్న సస్పెన్స్‌

Akhil next movie to do with Sathya Pinisetty Direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా తెరకెక్కిన ‘హలో’ పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. మొదటి చిత్రం ‘అఖిల్‌’తో తీవ్రంగా నిరాశ పర్చిన అఖిల్‌ రెండవ చిత్రం ‘హలో’తో పర్వాలేదు అంటూ టాక్‌ సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మూడవ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు అక్కినేని ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. అక్కినేని అఖిల్‌ మూడవ సినిమా ఏంటా అనే విషయంపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అఖిల్‌ అక్కినేని మూడవ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు సత్య కూడా అఖిల్‌ దృష్టిలో ఉన్నాడని, తాజాగా ఆయన చెప్పిన కథ విన్నట్లుగా తెలుస్తోంది.

రవిరాజా పినిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సూపర్‌ హిట్స్‌ను అందుకున్న రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి హీరోగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవలే ఆది హీరోగా మలుపు అనే చిత్రం తెరకెక్కింది. ఆ సినిమాను రవిరాజా కుమారుడు సత్య పినిశెట్టి తెరకెక్కించాడు. దర్శకత్వంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సత్య పినిశెట్టి చెప్పిన కథకు అఖిల్‌ ఫిదా అయ్యాడని, త్వరలోనే అఖిల్‌తో సత్య సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు. అయితే వీరి కాంబో మూవీపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో వైపు రానా నిర్మాతగా అఖిల్‌ ఒక చిత్రం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి అఖిల్‌ మూడవ సినిమాపై సస్పెన్స్‌ కొనసాగుతుంది. జనవరి 10 తర్వాత అఖిల్‌ ప్రకటన చేస్తానంటూ ఇప్పటికే చెప్పాడు. సో సంక్రాంతి సందర్బంగా అక్కినేని ఫ్యాన్స్‌కు ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పే అవకాశం ఉంది.