ముంబైలో అక్షయ్‌ కుమార్‌ ఖరీదైన ఇల్లు

ముంబైలో అక్షయ్‌ కుమార్‌ ఖరీదైన ఇల్లు

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఖార్‌ వెస్ట్‌లోని జాయ్‌ లెజెండ్‌ భవనంలో 19వ ఫ్లోర్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌ను తన సొంతం చేసుకున్నాడట. 1878 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ కోసం అక్షయ్‌ రూ.7.8 కోట్లు వెచ్చించినట్లు సమాచారం!గతేడాది డిసెంబర్‌లో అక్షయ్‌ అంధేరీలో ఉన్న తన ఆఫీస్‌ను రూ.9 కోట్లకు అమ్మేశాడు.

ప్రస్తుతం ఈ ఖిలాడీ తన ఫ్యామిలీతో కలిసి జుహులోని డూప్లెక్స్‌ భవంతిలో నివసిస్తున్నాడు. ఈ హీరోకు ముంబైలోనే కాకుండా గోవా, మారిషస్‌లోనూ విలువైన ఆస్తులున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా ఒక్క సినిమాకు వంద కోట్ల పారితోషికం అందుకున్న అక్షయ్‌ ‘సిండ్రెల్లా’ చిత్రానికి ఏకంగా రూ.135 కోట్లు తీసుకుంటున్నాడని ఫిల్మీదునియాలో ఇన్‌సైడ్‌ టాక్‌. ‘బడే మియా చోటే మియా’ మూవీకి కూడా ఇంచుమించు అంతే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు భోగట్టా.