‘అలా వైకుంఠపురంలో’ చిత్రానికి భారీ హైప్

అలా వైకుంఠపురంలో చిత్రానికి భారీ హైప్

సంక్రాంతి బరిలో వున్న సినిమాల్లో అలా వైకుంఠపురంలో చిత్రానికి భారీ హైప్ ఏర్పడింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి థియేటర్ల విషయంలో అభిమానులు చాల నిరాశని వ్యక్తపరుస్తున్నారు. సినిమా కి భారీగా పబ్లసిటీ ఉన్నప్పటికీ థియేటర్ల కొరత ఉంటే కలెక్షన్లు కష్టమని చెప్పాలి. అయితే సంక్రాంతికి ముందే దర్బార్, సరిలేరు నీకెవ్వరూ చిత్రాల నుండి అల్లు అర్జున్ చిత్రం గట్టి పోటీనే ఎదుర్కోనుంది. అయితే విడుదలకు ముందే ఈ థియేటర్ల కొరత అభిమానుల్ని కలవర పెడుతుంది.

ఈ చిత్రానికి థియేటర్ల కొరత ఒక సమస్య అయితే, కొందరు మాత్రం హీరోల సినిమాల్ని బ్యాన్ చేయాలనీ కోరుతున్నారు. అమరావతి రాజధానిని తరలిస్తున్న నేపథ్యంలో అమరావతి ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి సినిమాలకి ఈ ఆందోళనలు ప్రభావం చూపనున్నాయి. ఈ చిత్రానికి మాత్రమే కాకుండా మిగతా చిత్రాల పైన కూడా రాజధాని అంశం ప్రభావం పడే అవకాశం వుంది.