మద్యం గొడవ క్రికెటర్ ను చంపేసింది..

మాజీ రంజీ క్రికెటర్ కె. జయమోహన్ తంపి గత వారం ఇంట్లో శవమై కనిపించాడు. దీంతో వారి కుమారుడిని తాజాగా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం తిరువనంతపురంలోని ఆయన నివాసంలో శవమై కనిపించారు కె. జయమోహన్. 64 ఏళ్ల జయమోహన్ తంపి మనాకాడ్‌లోని తన ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు అతని ఇంట్లో అద్దెకు ఉండేవారు గ్రహించి పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అక్కడ కుళ్ళిన స్థితిలో ఉన్న శవాన్ని గుర్తించారు. ఆ మృతిపట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేయడంతో జయమోహన్ కుమారుడు అశ్విన్ ని అరెస్ట్ చేశారు. అయితే  అస్విన్‌ ను పోలీసులు ఈరోజు కోర్టుకు హాజరుపరచనున్నారు.

అదేవిధంగా జయమోహన్ తంపి శవపరీక్ష నివేదికలో అతను తన కొడుకుతో మద్యం సేవించే సమయంలో వచ్చిన ఘర్షణలో తలకు తీవ్ర గాయమై మరణించాడని తెలిసింది. మృతదేహం దొరికినప్పుడు అప్పటికే అతను మరణించి 36 గంటలు అవుతుందని నివేదిక వెల్లడౌతుంది. తండ్రీ, కొడుకు ఇంట్లో కలిసి మద్యం తాగేందుకు అలవాటు పడ్డారు. జయమోహన్ మరణించిన రోజు కూడా వారు కలిసి మద్యం తాగారు. కాగా జయమోహన్ తంపి డెబిట్ కార్డు కలిగి ఉన్న అశ్విన్, ఎక్కువ మద్యం కొనడానికి ఎటిఎమ్ నుండి డబ్బు తీసుకోవాలనుకున్నాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. ఇది వారి మధ్య ఘర్షణకు దారితీసిందని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి వివరించారు.

కాగా వారి ఇంటి వరండాలో గొడవకు దిగిన ఇద్దరూ…. తండ్రిని నెట్టడంతో తంపి జారి క్రింద పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా కొడుకు తిరిగి వచ్చి తన మృతదేహాన్ని ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళాడని. జయమోహన్ తంపి 1979, 1983 మధ్య కేరళ తరపున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కుడిచేతి వాటం బాట్స్మెన్, వికెట్ కీపర్ గా అధికారులు వివరించారు.