ఈసారి ఎలిమినేషన్‌లో అందరూ…!

All Members Eliminated In Bigg Boss House In This Week

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగింపు దశకు చేరుకుంది. ఈ సమయంలో షో మరింత ఆసక్తికరంగా సాగుతుంది. రెండు వారాలు మిగిలి ఉన్న షోలో ఇంకా ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ ఆరుగురు సభ్యుల్లో ఈ వారం నలుగురు ఎలిమినేషన్స్‌కు నామినేట్‌ అవ్వాల్సి ఉంది. కాని ఈవారం ఇంటి సభ్యులు చేసిన తప్పిదం కారణంగా అందరు సభ్యులు కూడా ఎలిమినేషన్‌లో ఉన్నారు.

deepthi-big-boss

రూల్స్‌ పాటించకపోవడంతో పాటు, పదే పదే టాస్క్‌లను లైట్‌ తీసుకుంటున్న కారణంగా, కెప్టెన్సీ టాస్క్‌ల్లో సీరియస్‌ నెస్‌ చూపించని కారణంగా ఇంటి సభ్యులందరు కూడా నామినేట్‌ అయినట్లుగా బిగ్‌ బాస్‌ ప్రకటించాడు.

bigboss-samrat

ఈ వారం చివరి నామినేషన్స్‌ అంటూ బిగ్‌ బాస్‌ ప్రకటించడంతో పాటు, నామినేషన్స్‌లో కౌశల్‌, తనీష్‌, రోల్‌ రైడా, సామ్రాట్‌, దీప్తి, గీతామాధురిలు ఉన్నారు. అందరిలో ఒక్కరు లేదా ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని అనిపిస్తుంది. తెలుగు బిగ్‌ బాస్‌ విజేత కౌశల్‌ అంటూ ఇప్పటికే అంతా భావిస్తున్న కారణంగా ఎలిమినేషన్స్‌ నుండి ఆయన సునాయాసంగా సేఫ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇక దీప్తి మరియు రోల్‌ రైడాల్లో ఇద్దరు లేదా ఎవరో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వారం బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరుగనుంది. ఆ కార్యక్రమానికి నాగార్జున ముఖ్య అతిథిగా వస్తాడనే టాక్‌ వినిపిస్తుంది.

bigboss-thanisk