అఖిల్‌ సేఫ్‌ గేమ్‌ ఆడాలనుకుంటున్నాడా…?

Akhil Mr Majnu Movie Release On January

అక్కినేని అఖిల్‌ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రంను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా గత మూడు నాలుగు నెలలుగా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంను డిసెంబర్‌లో విడుదల చేయడం లేదు అంటూ తెలుస్తోంది. డిసెంబర్‌లో కాకుండా నెల ఆలస్యంగా అంటే జనవరిలో సినిమాను విడుదల చేయాలని ఫిక్స్‌ అయినట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న చిత్రం కనుక సేఫ్‌ జోన్‌లో, పోటీ లేని సమయంలో విడుదల చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.

akhil-movie-majnu

అఖిల్‌ రెండవ సినిమాకు నాని సినిమాతో పోటీ ఏర్పడినది. ఆ కారణంగా హలో చిత్రం అంతగా కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది. అందుకే ఇప్పుడు పోటీ లేని సమయంలో రావాలనే ఉద్దేశ్యంతో అఖిల్‌ తన మూడవ చిత్రంతో రిపబ్లిక్‌ డే సందర్బంగా రావాలని నిర్ణయించుకున్నాడు. అక్కినేని అఖిల్‌ మూడవ చిత్రం వచ్చే జనవరిలో ఉంటుందనే టాక్‌ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక ఈ చిత్రంపై నాగార్జున చాలా కేర్‌ తీసుకుంటున్నాడు. అఖిల్‌ గత చిత్రాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా తప్పు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నాడు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

akhil-movie