“నా సామిరంగ” నుండి రేపు అల్లరి నరేష్ ఇంట్రో గ్లింప్స్!

“నా సామిరంగ” నుండి రేపు అల్లరి నరేష్ ఇంట్రో గ్లింప్స్!
Na Sami Ranga

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో, విజయ్ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా లో అల్లరి నరేష్ అంజి పాత్రలో ఆడియెన్స్ ని అలరించనున్నారు.

“నా సామిరంగ” నుండి రేపు అల్లరి నరేష్ ఇంట్రో గ్లింప్స్!
Na Saami Ranga

ఈ పాత్ర కి సంబందించిన ఇంట్రో గ్లింప్స్ ని మేకర్స్ రేపు ఉదయం 10:18 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా కి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, అషికా రంగనాథ్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.