బన్నీ ప్రయోగానికి సిద్దమా?

Allu arjun and director Vi Anand movie fixed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అల్లు అర్జున్‌ వరుగా సూపర్‌ హిట్స్‌ను అందుకుంటూ వస్తున్నాడు. ఈ సంవత్సరం ‘డీజే’ చిత్రంతో సక్సెస్‌ను అందుకున్న బన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా అల్లు అర్జున్‌ ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు వి ఆనంద్‌ దర్శకత్వంలో ఒక విభిన్న చిత్రాన్ని చేసేందుకు బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

అల్లు శిరీష్‌, సురభి జంటగా తెరకెక్కిన ‘ఒక్క క్షణం’ చిత్రం తాజాగా విడుదలైంది. ఆ చిత్రం షూటింగ్‌ సమయంలోనే దర్శకుడు వి ఆనంద్‌ పనితనంపై బన్నీ ప్రశంసలు కురిపించాడు. కథ చెప్పినప్పుడే బన్నీకి తెగ నచ్చేసిందట. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందని బన్నీ గట్టిగా చెప్పాడు. అదే సమయంలో తనకు కూడా ఇలాంటి కథాంశంతో సినిమా చేయాలని ఉందని, హర్రర్‌ నేపథ్యంలో ఒక కథను సిద్దం చేస్తే తాను నటిస్తాను అంటూ ఆనంద్‌తో బన్నీ చెప్పాడట. దాంతో ప్రస్తుతం బన్నీ కోసం వి ఆనంద్‌ కథను సిద్దం చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బన్నీకి నచ్చే విధంగా కథను వి ఆనంద్‌ సిద్దం చేస్తే వచ్చే సంవత్సరం చివర్లో ఆయన దర్శకత్వంలో సినిమాను చేసే అవకాశం ఉంది. మరి బన్నీని దర్శకుడు వి ఆనంద్‌ మెప్పించే స్థాయిలో కథను సిద్దం చేస్తాడా లేదా అనేది చూడాలి.