నాగార్జునను కాకా పడుతున్న మంచు వారి అమ్మాయి

Manchu Lakshmi wants to Request Nagarjuna for web Series

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. పలు చిత్రాల్లో నటించి, నిర్మించిన మంచు లక్ష్మి గత కొన్ని రోజులుగా బుల్లి తెరపై సందడి చేస్తోంది. హోస్ట్‌గా పలు షోలు చేసిన ఈమె ప్రస్తుతం ఫిదా అనే ఒక బుల్లి తెర షోను నిర్మిస్తుంది. తెలుగు సినిమా తారల రియల్‌ లైఫ్‌ స్టైల్‌ ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. వారికి వారి అభిమాన తార జీవిత శైలిని వివరించేందుకు మంచు లక్ష్మి ఈ షోను ప్రారంభించింది. హరితేజ ఈ షోకు హోస్టింగ్‌ చేస్తోంది. ఇక తాజాగా మంచు లక్ష్మి ఒక వెబ్‌ సిరీస్‌కు సిద్దం అవుతుంది.

ప్రస్తుతం తెలుగు సినిమా తారలు వెబ్‌ సిరీస్‌ల మీద పడుతున్నారు. ముఖ్యంగా యువ హీరోలు వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు, నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా మంచు లక్ష్మి కూడా ఒక వెబ్‌ సిరీస్‌ను చేసేందుకు సిద్దం అయ్యింది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రకు నాగార్జున అయితే బాగుంటుందనే అభిప్రాయంను దర్శకుడు వ్యక్తం చేస్తున్నాడు.

మంచు లక్ష్మి కూడా అదే కోరుకుంటుంది. నాగార్జునను ఆ పాత్రకు ఒప్పిస్తే వెబ్‌ సిరీస్‌ స్థాయి పెరిగి పోతుందని మంచు లక్ష్మి భావిస్తుంది. నాగార్జున స్థాయికి తగ్గట్లుగా ఆ పాత్ర ఉంటుందని ఆయన చేస్తాడనే నమ్మకంతో మంచు లక్ష్మి ఉంది. త్వరలోనే నేరుగా ఆయన్ను కలిసి రిక్వెస్ట్‌ చేస్తాను అంటూ మంచు లక్ష్మి సన్నిహితులతో చెప్పుకొచ్చింది. మరి మంచు లక్ష్మి కోరికను నాగార్జున కాదనుకుండా వెబ్‌ సిరీస్‌లో నటిస్తాడా లేదా అనేది చూడాలి.